టాలీవుడ్‌లో "డ్రగ్స్" దొంగలు..రవితేజ కూడా..?
on Jul 14, 2017
.jpg)
టాలీవుడ్‌లో డ్రగ్స్ దందా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకరిద్దరి వల్ల మొత్తం ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందంటూ సినీ పెద్దలు ప్రెస్ మీట్‌లో వాపోవడంతో సినీ ప్రముఖులు ఉలిక్కిపడ్డారు. దీంతో డ్రగ్స్ దందాపై తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు డొంక లాగడం ప్రారంభించారు. విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు ప్రముఖులకు నోటీసులు పంపించారు. రవితేజ, సుబ్బరాజు, పూరీ జగన్నాథ్, నవదీప్, శ్యామ్‌కె నాయుడు, ఛార్మీ, ముమైత్ ఖాన్, నందూ, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, తరుణ్, తనీష్‌లకు నోటీసులు వెళ్లినట్లు సమాచారం. వీరంతా ఈ నెల 19 నుంచి 27 వరకూ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రతీ ఒక్కరూ వ్యక్తిగతంగానే హాజరుకావాలని..రాకుంటే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



