బావి నీళ్ల కోసం జయప్రద పోరాటం
on Jul 13, 2017

జయప్రద ప్రస్తుతం ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. సినిమా పేరు ‘శరభ’. భారీ బడ్జెట్ లో రూపొందుతోన్న సోషియో ఫాంటసీ సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఇదిలావుంటే... జయప్రద మరో సినిమాకు కూడా సైన్ చేసేశారు. అయితే... అది తెలుగు సినిమా కాదు. తమిళ సినిమా. పేరు ‘కెని’.పార్దీబన్ ఇందులో జయప్రదకు జోడీగా నటించనున్నారు. మలయాళ దర్శకుడు ఎం.ఎ.నిషాద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశాలున్నాయి. అవేంటంటే...
ఇది 1956 నాటి కథ. కేరళ, తమిళనాడు రాష్ట్రాల మధ్య వచ్చిన జల వివాదం నేపథ్యంలో సాగే కథ ఇది. జల వివాదం అంటే... ఇదేదో నదీ జలాల నేపథ్యంలో సాగే కథ అనుకుంటే మీరు పొరబడ్డట్టే.. కేరళ, తమిళనాడు బోర్డర్ లో ఉన్న ఓ ఇంట్లో బావి ఉంటుంది. ఆ ‘బావి’వల్ల వచ్చిన తగాదానే ఈ సినిమా కథ. ఆ బావి ఉన్న ఇంటి ఓనర్ పాత్రలో జయప్రద నటించనున్నారు. ఆమె భర్తగా పార్దీన్ కనిపిస్తారు.
ఈ సినిమాలో నటించడం పట్ల పార్దీబన్ మీడియా ముందు ఆనందం వెలిబుచ్చారు. తాను భాగ్యరాజా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే రోజుల్లో జయప్రదతో పని చేశాననీ, ఇప్పుడు ఆమెతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందనీ, ఇది చాలా భిన్నమైన కథాంశమనీ పార్తీబన్ చెప్పారు. ఇందులో కీలక పాత్రలో నాజర్ నటించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



