ఎదురుకట్నం ఇచ్చినట్లు...రెమ్యునరేషన్ ఎదురిచ్చాడు..!
on Jul 14, 2017

అప్పట్లో అందమైన అమ్మాయి భార్యగా కావాలంటే ఎదురు కట్నం ఇచ్చి మరి పెళ్లి చేసుకునేవారు గుర్తుందా..అలాగే మన సీనియర్ హీరో జగపతిబాబు కూడా ఎదురుకట్నం ఇచ్చాడట..మీరు ఏదో అనుకోకండి..ఇక్కడ ఎదురుకట్నం అంటే రెమ్యునరేషన్ అని అర్థం. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తెలుగునాట మంచిపేరు తెచ్చుకున్న జగపతిబాబుకు ఆ తర్వాత ఆఫర్లు తగ్గిపోయాయి..దీంతో సహాయ పాత్రలు చేస్తూ నెట్టుకొచ్చాడు..అటువంటి టైంలో లెజెండ్ సినిమాలో చేసిన విలన్ పాత్రతో మనోడి దశ తిరిగిపోయింది. ఇక వరుసపెట్టి విలన్ క్యారెక్టర్లు చేస్తూ పోయాడు..
సరిగ్గా ఇదే సమయంలో చాలా రోజుల తర్వాత జగపతికి లీడ్ రోల్ చేసే అవకాశం వచ్చింది. అదే పటేల్ ఎస్.ఐ.ఆర్. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా జగపతి మీడియాతో మాట్లాడుతూ..కథ వినగానే బాగా నచ్చిందని, అయితే దర్శకుడు కొత్తవాడు కావడంతో, తనపై అంతగా నమ్మకం కుదరలేదని..తాను ఈ సినిమాలో నటించాలంటే ఒక కండిషన్‌కు ఒప్పుకోవాలన్నాను. అదేంటంటే ఈ సినిమాకు సంబంధించి ఒక టీజర్‌ను చేసి చూపించమని తానే ఒక లక్షన్నర ఇచ్చానన్నారు జగపతి..ఆ తర్వాత తను తీసుకువచ్చిన టీజర్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పుకొచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



