తూర్పు గోదావరిలో థియేటర్లు బంద్
on Mar 19, 2020
తెలంగాణాలో థియేటర్లు బంద్ చేయమని రాష్ట్ర ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చింది. ఏపీలో ప్రభుత్వం ఏమీ అటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. అయినప్పటికీ... డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ యాజమాన్యాలు స్వచ్ఛందంగా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. రాజమండ్రిలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఈ విషయం వెల్లడించారు. దీనికి కారణం కరోనా ఎఫెక్ట్. తెలంగాణాలో థియేటర్లు బంద్ చేయడానికీ కారణం కరోనానే. తెలుగు సినిమాలకు తెలంగాణలోకలెక్షన్స్ కూడా ముఖ్యమే. అందుకని, కొత్త సినిమాలను విడుదల చేయడం మానేశారు. ఆల్రెడీ విడుదలకు సిద్ధమైన సినిమాలను వాయిదా వేశారు. కొత్త సినిమాలు లేక ఏపీలో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గింది. కరోనా ఎఫెక్ట్ కారణంగా థియేటర్లకు వెళ్లడానికి ప్రజలు కాస్త ఆలోచిస్తున్నారు. దాంతో కలెక్షన్స్ బాగా డ్రాప్ అవుతున్నాయి. చాలాచోట్ల అయ్యాయి కూడా. ఖర్చులకు సరిపడా డబ్బులు రావడం లేదు. అందువల్ల, స్వచ్ఛందంగా థియేటర్లు బంద్ చేయాలని కొందరు నిర్ణయం తీసుకున్నారు.