ధనుష్, అక్షయ్ కలిసి నటిస్తున్నారు!
on Jan 31, 2020
బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ కుమార్, తమిళ్ స్టార్ యాక్టర్ ధనుష్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరుపొందిన ఆనంద్ ఎల్. రాయ్ రూపొందించే ఆ సినిమా పేరు 'అత్రంగీ రే'. సారా అలీఖాన్ హీరోయిన్. ఈ విషయాన్ని ఆమె స్వయంగా బ్రేక్ చేసింది. ఆ ఇద్దరితో కలిసి తీయించుకున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రాం పేజీలో షేర్ చేసిన ఆమె "నా అదృష్టాన్ని నమ్మలేకపోతున్నా. నా తర్వాతి ఫిల్మ్.. 'అత్రంగీ రే'. ఆనంద్ ఎల్. రాయ్ గారితో పనిచేస్తుండటం నా భాగ్యం.. అందులోనూ అది ఎ.ఆర్. రెహమాన్ మ్యూజికల్. అత్యంత ప్రతిభావంతుడైన, నమ్మశక్యం కాని వినయవంతుడైన ధనుష్‌తో, నాతో కలిసి నటించడానికి అంగీకరించిన అక్షయ్ కుమార్ గారికి చాలా థాంక్స్. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. ఫిబ్రవరి 14 వేలంటైన్స్ డేకి కలుద్దాం" అని పోస్ట్ చేసింది.
ఆమె షేర్ చేసిన ఫొటోలో చెరో పక్క నుంచి సారా బుగ్గలపై అక్షయ్, ధనుష్ ముద్దు పెడుతున్నారు. ధనుష్‌ను 'రాన్‌ఝానా' మూవీతో బాలీవుడ్‌కు పరిచయం చేసింది ఆనంద్ ఎల్. రాయే. ఇప్పుడు మరోసారి ధనుష్‌తో బాలీవుడ్ సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యలో అమితాబ్‌తో కలిసి 'షమితాబ్' మూవీ చేశాడు ధనుష్. కాగా ఈ మూవీలో తన రోల్ గురించి అక్షయ్ మాట్లాడుతూ అది తనకు ఛాలెంజింగ్ రోల్ అనీ, చాలా కాలం పాటు దాని గురించి మాట్లాడుకుంటారనీ తెలిపాడు. డైరెక్టర్ కథ చెప్పగానే పది నిమిషాల్లో ఓకే చేశానని చెప్పాడు. మార్చి 1న 'అత్రంగీ రే' సెట్స్ మీదకు వెళ్తోంది.