ఆ పని మాత్రం చేయకండి ప్లీజ్.. ‘శ్వాగ్’ హీరో శ్రీవిష్ణు విజ్ఞప్తి!
on Oct 4, 2024
ఈవారం విడుదలైన సినిమాల్లో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘శ్వాగ్’ చిత్రంపై ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే డిఫరెంట్‌గా అనిపించిన ట్రైలర్ వల్ల ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. హసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ‘శ్వాగ్’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు విడుదలైంది. అంతేకాదు, ఒక రోజు ముందు ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోలు వేశారు. సినిమా మీద దర్శకనిర్మాతలకు ఉన్న నమ్మకం వల్లే ప్రీమియర్స్ వేశారు. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌పై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది.
ఈ సినిమా రిలీజ్‌కి ముందు శ్రీవిష్ణు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి చేస్తూ ‘భిన్నమైన టైటిల్, విభిన్నమైన కథతో వస్తున్న ఈ సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి. సినిమాను చూసిన వారు దయచేసి ఆ ట్విస్టుల గురించి ఎవరికీ చెప్పొద్దని మనవి. మీడియా ద్వారాగానీ, సోషల్ మీడియా ద్వారాగానీ వాటిని రివీల్ చెయ్యొద్దు. మీరు సినిమా చూడండి. అందరికీ నచ్చుతుంది’ అన్నారు.