చిరంజీవికి ఇంకా రెండు పాటలే మిగిలి ఉన్నాయి
on Oct 4, 2024
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)నుంచి రాబోయే నెక్స్ట్ మూవీ విశ్వంభర(vishwambhara)జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత చిరు నుంచి వస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూడా ఇదే. దీంతో విశ్వంభర ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి అడుగు పెడుతుందా అని మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
కొన్ని రోజుల నుంచి విశ్వంభర షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది.ఇంకో పక్క డబ్బింగ్,పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా మూవీకి సంబంధించిన మరో అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి.భోళా శంకర్ పరాజయంతో చిరంజీవి ఎంతో కసిగా చేస్తున్న విశ్వంభర లో త్రిష(trisha)ఒక హీరోయిన్ గా చేస్తుండగా నాగార్జున తో నా సామిరంగ లో జత కట్టిన ఆషికా రంగనాధ్(Ashika Ranganath)కూడా ఒక హీరోయిన్ గా చేస్తుంది. తెలుగు చిత్ర సీమకి చెందిన భారీ తారాగణం మొత్తం చేస్తుండగా ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.
కళ్యాణ్ రామ్(kalyan ram)కి బింబిసార(bimbisaara)లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వశిష్ఠ(vasishta)దర్శకుడు కాగా యూవీ క్రియేషన్స్ పై ప్రమోద్, వంశీ రెడ్డి లు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.మూవీ ప్రారంభోత్సవం నాడే జనవరి పది న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. కానీ డేట్ మారే అవకాశాలు ఉన్నాయనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి.
Also Read