రామ్ నగర్ బన్నీ రివ్యూ
on Oct 4, 2024
సినిమా పేరు:రామ్ నగర్ బన్నీ
తారాగణం: చంద్రహాస్, విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితు మంత్ర, మురళి గౌడ్,సుజాత తదితరులు
సంగీతం:అశ్విన్ హేమంత్
ఫొటోగ్రఫీ: అష్కర్ అలీ
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
రచన, దర్శకత్వం: శ్రీనివాస్ మహత్
బ్యానర్ :శ్రీ సుమనోహర ప్రొడక్షన్స్
నిర్మాతలు:ప్రభాకర్ పొడకండ్ల,మలయజ పొడకండ్ల
విడుదల తేదీ: అక్టోబర్ 4 , 2024
సుదీర్ఘ కాలంగా తన నటనతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నప్రముఖ సినీ, టివి నటుడు ప్రభాకర్ నట వారసుడు చంద్ర హాస్ తొలిసారి నటించిన రామ్ నగర్ బన్నీ(ram nagar bunny)ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
బన్నీ అలియాస్ రామ్ నగర్ బన్నీ(చంద్రహాస్) ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. నేటి తరం చాలా మంది కుర్రోళ్ల మాదిరిగా ఇరవై నాలుగు గంటలు ఫుల్ యాటిట్యూడ్ తో ఉంటాడు.ప్రేమకి, ఆకర్షణకి తేడా తెలియని బన్నీ తొలి చూపులోనే దివ్య సింగ్ (రిచా జోషి) నయన(అంబికా వాణి,) అనే ఇద్దరమ్మాయిల ప్రేమలో పడతాడు. ఆ ఇద్దరు కూడా బన్నీ ని ప్రేమిస్తారు. మరో వైపు శైలు(విస్మయ శ్రీ) అనే అమ్మాయి బన్నీ మీద ప్రేమని పెంచుకొని బన్నీ ఇంట్లోనే పని మనిషిగా ఉంటూ ఇంట్లో వాళ్లందరికీ సేవ చేస్తూ ఉంటుంది.అనుకోకుండా ఒక రాత్రి బన్నీ, శైలు శారీరకంగా కలవడంతో పెళ్లి చేసుకోమని శైలు అడుగుతుంది.దాంతో విషయాన్నీ లైట్ గా తీసుకోమని చెప్తాడు.ఇలా జరుగుతున్న కథలో బన్నీ కంటే వయసులో పది సంవత్సరాల పెద్దదైన తార( రితు మంత్ర) అనే కోటీశ్వరులు బన్నీ మీద ఇష్టాన్ని పెంచుకొంటుంది. దాంతో పెళ్లి చేసుంటానని చెప్తే బన్నీ కూడా ఒప్పుకుంటాడు. బన్నీ ఆ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నాడు? దివ్య సింగ్, నయన ల లవ్ ఏమైంది? శైలు కి న్యాయం జరిగిందా? అసలు శైలు పని మనిషిలా బన్నీ లైఫ్ లోకి ఎందుకు వచ్చింది? మరి చివరకి బన్నీ నిజమైన ప్రేమకి అర్ధం తెలుసుకున్నాడా? లేదా అనేదే ఈ కథ
ఎనాలసిస్ :
ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్త కాకపోయినా కూడా పకడ్బందీ స్క్రీన్ ప్లే ఉండటం వలన ఎక్కడా బోర్ కొట్టకుండా ముందుకు సాగింది.ముఖ్యంగా ఎంటర్ టైన్మెంట్ సినిమాని కాపాడింది. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే ప్రారంభ సన్నివేశంలోనే తన కంటే వయసులో పెద్దదయిన ఆంటీ ని పెళ్లి చేసుకోబోతున్నానని చంద్రహాస్(chandrahass)చెప్పడంతో ప్రేక్షకుడికి సినిమా మీద ఆసక్తిని పెంచేలా చేసింది.ఇక ఆ తర్వాత కాలేజీ గొడవలు, ఇద్దరు అమ్మాయిలని ప్రేమించడం,వాళ్ళతో జల్సాగా తిరగడం కోసం ఇంట్లో డబ్బులు దొంగతనం చెయ్యడం లాంటివన్నీ ఎన్నో యూత్ సినిమాల్లో వచ్చినవే. కాకపోతే ప్రెజంటేషన్ కొత్తగా ఉండటంతో బోర్ కొట్టకుండా ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ తో బన్నీ ఉండే సీన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉన్నాయి. థియేటర్ లో ఆ సీన్స్ కి నవ్వని ప్రేక్షకుడంటూ ఉండడు.ఇక సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే ప్రతి సీన్ కూడా ఫాస్ట్ గా ఉండి సినిమాలో వేగాన్ని పెంచింది. సినిమాలో ఏముంది అని ప్రేక్షకుడు ఆలోచించే లోపు ఫస్ట్ ఆఫ్ లో చూపించని ఒక ట్విస్ట్ ని ప్రారంభంలోనే రివీల్ చేసి ఇంట్రెస్టింగ్ ని కలగచేసారు.ప్రతి సీన్ కి కూడా ఒక పర్పస్ ఉండేలా డిజైన్ చేసారు.కాకపోతే బన్నీ తన కంటే వయసులో పెద్దదయిన ఆవిడతో పెళ్ళికి ఒప్పుకోటానికి కొంచం టైం ఇచ్చి ఉండాల్సింది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
బిరుదుకి తగ్గట్టే తన యాటిట్యూడ్ తో చంద్రహాస్ ఒక రేంజ్ పెర్ఫార్మెన్సు ని ప్రదర్శించాడు. స్క్రీన్ ప్రెజన్స్ కూడా చాలా బాగుంది.పెద్ద హీరో స్థాయిలో ఒంటి చేత్తో సినిమాని ముందుండి నడిపించాడు.ముఖ్యంగా డాన్స్ లలో వీరవిహారం చేసాడు. చంద్రహాస్ రూపంలో ఇండస్ట్రీ కి ఇంకో మంచి హీరో దొరికినట్టే. ఇక హీరోయిన్లు గా చేసిన విస్మయ శ్రీ,రిచా జోషి, అంబికా వాణి, రితు మంత్ర లు ఎంతో అనుభవమున్న వాళ్ళలా చేసారు. ముఖ్యంగా విస్మయ శ్రీ మెయిన్ హీరోయిన్ హోదాలో అయితే రెండు వేరియేషన్స్ లో పరిణితి తో కూడిన నటనని ప్రదర్శించింది.చంద్ర హాస్ తండ్రిగా చేసిన మురళి గౌడ్ అయితే మరోసారి తన నటనతో నవ్వులు పూయించాడు.తల్లిగా చేసిన సుజాత, బామ్మగా చేసిన బలగం ఫేమ్ నటి కూడా చాలా బాగా చేసారు. ఇక అష్కర్ అలీ కెమెరా పని తనం, అశ్విన్ హేమంత్ సంగీతం సినిమాని అదనపు బలాన్ని ఇచ్చాయి.ఇక శ్రీనివాస్ మహత్ (srinivas mahath)రచనా దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేమ్ లోనే కొట్టొచ్చినట్టు కనపడింది. ముఖ్యంగా డైలాగులు అయితే సూపర్ గా ఉన్నాయి.
ఇలాంటి కథలు తెలుగు తెరపై గతంలో చాలానే వచ్చాయి. కానీ బోర్ కొట్టని కధనాలు, కామెడి, నటీనటుల పెర్ఫార్మెన్సు సినిమాని పర్లేదనే స్థాయిలో ఉంచాయి.
రేటింగ్ : 2.25/ 5
అరుణాచలం
Also Read