త్రివిక్రమ్ కథ... బ్రహ్మానందం హీరో!
on Oct 25, 2016

టాలీవుడ్‌లో ఆసక్తి కరమైన కాంబినేషన్‌కి రంగం సిద్దమైందా? బ్రహ్మానందం హీరోగా త్రివిక్రమ్ కథతో ఓ సినిమా తెరకెక్కనుందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. బ్రహ్మానందం కథానాయకుడిగా రేష్మి, అనసూయ కథానాయికలుగా ఓ సినిమా రూపుదిద్దుకొనే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దగ్గర సహాయకుడిగా పనిచేసిన ఓ యువ దర్శకుడు టేకప్ చేస్తాడని సమాచారం. ఫండింగ్ కూడా త్రివిక్రమ్ పెట్టబోతున్నాడని టాక్. త్రివిక్రమ్ సినిమాల్లో బ్రహ్మానందానికి మంచి పాత్రలే దక్కాయి.
ఇప్పుడు బ్రహ్మీనే.. మెయిన్ రోల్ అవుతున్నాడన్నమాట. ఈ మధ్య బ్రహ్మీకి సినిమాలు బాగా తగ్గాయి. కొత్తకమెడియన్ల జోరుతో ఆయన స్పీడుకు బ్రేకులు పడ్డాయి. ఈ దశలో ఇలాంటి అవకాశం రావడం, అదీ ఈ సినిమా వెనుక త్రివిక్రమ్ హ్యాండ్ ఉండడం... బ్రహ్మీకి కలిసొచ్చే విషయాలే. అయితే బ్రహ్మానందం హీరోగా గతంలోనూ కొన్ని సినిమాలొచ్చాయి. అవన్నీ ఫెయిల్యూర్సే. మళ్లీ బ్రహ్మీ అలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈసారైనా. హిట్టు కొడతాడా?? హిట్ అయితే బ్రేకులు పడిన బ్రహ్మీ బండి మళ్లీ ముందుకు కదిలే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



