ఆ కమెడియన్ రుణం తీర్చుకోబోతున్న పవన్...!
on Oct 24, 2016
.jpg)
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ తెరపై నటుడిగానే కాకుండా తన వ్యక్తిత్వం ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి. ఇండస్ట్రీలో కాని..బయట కాని పవన్‌ని సాయం అడిగేవారే కాని..పవన్ ఎవరిని సాయం అడిగింది లేదు. అయితే పవన్ అడక్కుండానే ఒక వ్యక్తి హెల్ప్ చేశాడు. అతను ఎవరో కాదు అతితక్కువ సమయంలో స్టార్ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి. తాను హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రిజస్టర్ చేసుకున్న "కాటమరాయుడు" టైటిల్‌ని పవన్ కళ్యాణ్ కోసం వదిలేశాడు. ఈ నేపథ్యంలో తన సినిమాకి "సప్తగిరి ఎక్స్‌ప్రెస్" అనే పేరు పెట్టుకున్నాడు.
అయితే అడక్కుండానే ఇంత సాయం చేసిన సప్తిగిరి రుణాన్ని ఎలాగైనా తీర్చుకోవాలని పవన్ డిసైడయ్యాడట. దీనిలో భాగంగా సప్తగిరి ఎక్స్‌ప్రెస్ ఆడియో రిలీజ్‌కు చీఫ్ గెస్ట్‌గా అటెండ్ కావాలని భావిస్తున్నాడట. అదే గనుక నిజమైతే సప్తగిరి జాక్‌పాట్ కొట్టినట్లే. ఎందుకంటే పవన్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజును క్యాష్ చేసుకోవడానికి చాలా మంది యంగ్ హీరోలు తరచూ పవన్‌ను తమ ఆడియో రిలీజ్‌లకు ఆహ్వానించడమో..సినిమాలో పవర్‌స్టార్ డైలాగ్ వాడుకోవడమో చేస్తూ సినిమాకు మంచి వసూళ్లు రాబట్టుకుంటూ ఉంటారు. ఆ రకంగా చూస్తే సప్తగిరికి బంపర్ ఆఫర్ తగిలినట్లే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



