విజయ్‌కి భారీ భద్రత..!
on Oct 25, 2016

సినీ పరిశ్రమను పట్టి పీడిస్తున్న సమస్య పైరసీ. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఏదో ఒక రూపంలో పైరసీ భూతం వెలుగు చూస్తునే ఉంది. షూటింగ్ స్పాట్లలో, ల్యాబ్‌ల్లో చిత్ర యూనిట్ కఠినంగా వ్యవహరించినా...ఎలాగో ఆ సన్నివేశాలు బయటకు వస్తున్నాయి. తాజాగా తమిళస్టార్ హీరో, ఇళయదళపతి విజయ్ తాజా చిత్రం భైరవ చిత్ర షూటింగ్ స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి పాటలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో విజయ్, హీరోయిన్ కీర్తి సురేష్‌లపై షూట్ చేసిన కొన్ని సన్నివేశాలను ఎవరో ఫోటో తీసి నెట్‌లో పెట్టారు. వీటిని చూసి ఖంగుతిన్న చిత్ర యూనిట్ అప్రమత్తమైంది. దీంతో లోకేషన్లో సెక్యూరిటీని పెంచారు. సంబంధం లేని వారిని లోనికి ప్రవేశించనీయకుండా..షూటింగ్‌కు ఎవరు సెల్‌ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకురాకుండా అంక్షలు విధించారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



