తొందరపడి సినిమాలను ఓటీటీలకు అమ్ముకోవద్దు
on Jul 3, 2021

కరోనా కారణంగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో పలు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు.. ఒకవేళ ఓపెన్ అయినా.. ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు రావడానికి చాలా టైం పట్టే అవకాశముంది. దీంతో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చాలా సినిమాలు ఓటీటీల వైపు చూస్తున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా తెలంగాణ స్టేట్ ఫిల్మ్‌ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్యర్వంలో ఎగ్జిబిటర్స్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో సినిమా రిలీజ్ లపై చర్చించిన ఎగ్జిబిటర్స్.. తొందరపడి సినిమాలను ఓటీటీలకు అమ్ముకోవద్దని నిర్మాతలకు సూచించారు. అక్టోబరు వరకు నిర్మాతలు వేచి చూడాలని.. అప్పటికి థియేటర్స్ రీ ఓపెన్ కాకపోతే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో సినిమాలను రిలీజ్ చేసుకోవాలని కోరారు. ఓటీటీలో సినిమాలను విడుదల చేస్తే థియేటర్ వ్యవస్థ పూర్తిగా పతనమయ్యే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎగ్జిబిటర్స్ ఆవేదనను అర్థం చేసుకొని అక్టోబరు వరకు నిర్మాతలు వేచి చూస్తారో లేదో చూడాలి. అయితే ఓటీటీలు చిన్న సినిమాల పాలిట వరంలా మారాయనే చెప్పాలి. ఒకప్పుడు థియేటర్లు దొరకడం లేదని చిన్న నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వారికి ఓటీటీలు కలిసొస్తున్నాయి. అయితే పెద్ద నిర్మాతలు మాత్రం థియేటర్లలోనే వారి సినిమాలు విడుదల చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



