ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకున్న మెహ్రీన్
on Jul 3, 2021

హీరోయిన్ మెహ్రీన్ పీర్జాదా సంచలన నిర్ణయం తీసుకుంది. హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య భిష్ణోయ్ తో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్టు మెహరీన్ ప్రకటన చేసింది. ఇటీవల మెహ్రీన్- భిష్ణోయ్ నిశ్చితార్థం జైపూర్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్టు మెహ్రీన్ ట్విటర్ ద్వారా తెలిపింది.
తామిద్దరం చర్చించి.. స్నేహపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెహ్రీన్ వెల్లడించింది. ఇకపై బిష్ణోయ్ తో కానీ, అతని కుటుంబసభ్యులతో కానీ తనకు ఎలాంటి సంబంధాలు లేవని తేల్చి చెప్పింది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అనేది తన వ్యక్తిగత వ్యవహారమన్న మెహ్రీన్.. ఇకపై తన ఫోకస్ అంతా సినిమాలపైనా పెడతానంటూ క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేసింది. మెహ్రీన్ ప్రకటనతో ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు.
కాగా మెహ్రీన్ ప్రస్తుతం ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3లో నటిస్తోంది. దీనితో పాటు కొన్ని సినిమాలు కమిట్ అయింది. వరుస ఆఫర్స్ వస్తుండటతో ఇకపై మూవీస్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టాలని నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్టు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



