కాజల్.. వేశ్యావతారం!
on Jul 4, 2021
.jpg)
పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ తన కెరీర్‌లో ఎక్కువగా సాఫ్ట్ రోల్స్ లోనే దర్శనమిచ్చింది. 'సీత', 'లైవ్ టాలీకాస్ట్' (సిరీస్)లో మాత్రమే కాస్త బోల్డ్ టచ్ ఇచ్చిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. త్వరలో వేశ్యగా కనిపించనుందట. ఆ వివరాల్లోకి వెళితే.. కింగ్ నాగార్జున కథానాయకుడిగా 'గరుడవేగ' ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ఈ మూవీలో నాగ్ మాజీ రా-ఏజెంట్ గా నటిస్తుండగా.. ఆయనకు జోడీగా కాజల్ దర్శనమివ్వనుంది. అంతేకాదు.. కాజల్ ది కూడా 'రా' ఏజెంట్ వేషమే. కాగా, కథానుసారం ఈ పాత్రలో మరో కోణం కూడా ఉంటుందట. అదేమిటంటే.. తీవ్రవాదుల సమాచారాన్ని డిపార్ట్ మెంట్ కి అందించే క్రమంలో కాజల్ వేశ్య అవతారమెత్తి.. తన అందచందాలతో టెర్రరిస్ట్ లను ఆకర్షిస్తుందట. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం.
మొత్తమ్మీద.. అభినయానికి అవకాశమున్న పాత్రలోనే టాలీవుడ్ చందమామ అలరించబోతోందన్నమాట. మరి.. నాగ్ - ప్రవీణ్ కాంబినేషన్ మూవీలో కాజల్ పాత్రపై వస్తున్న వార్తల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



