ఎంఎస్‌ని..ఎస్ఎస్‌ని కలుపుతోన్న ధోని
on Sep 22, 2016

ఒకరేమో సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ అంటే ఎంటో తెలియని దర్శకుడు..మరోకరు భారత క్రికెట్ చరిత్రనే మలుపు తిప్పిన కెప్టెన్. రెండు భిన్న ధృవాల్లాంటి వీరిద్దరూ ఒకే వేదిక మీదకు రాబోతున్నారు. వారిద్దరే టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. అసలు మ్యాటర్‌లోకి వెళితే..భారత క్రికెట్‌లోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా, మిస్టర్ కూల్‌గా ఖ్యాతిగాంచిన ధోని జీవిత గాధతో "ఎంఎస్ ధోని-ది అన్‌టోల్డ్ స్టోరీ" పేరుతో సినిమా రూపొందుతోంది. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 30వ తేదీన రిలీజవుతోంది. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ ధోనిగా నటిస్తుండగా, భూమిక మరో కీలకపాత్ర చేసింది. కాగా ఈ నెల 24న ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్నారు. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా ధోనీ హాజరుకానున్నాడు. ఆయనతో పాటు రాజమౌళీ కూడా అటెండ్ అవుతున్నాడు. వీరిద్దరి చేతుల మీదుగా ఆడియో లాంచ్ కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



