నాకు మీ జాలి వద్దు..!
on Sep 23, 2016

కొత్తబంగారు లోకం అమాయకమైన చూపులు చూస్తూ ఎకడా అంటూ పలకరించిన అమ్మాయి గుర్తుందా..ఆ అమ్మాయే శ్వేతాబసు ప్రసాద్. బాబ్లీ గర్ల్‌గా కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టి వరుస సినిమాలతో ఒక ఊపు ఊపింది. అయితే 2014లో ఒక వ్యభిచారం కేసులో ఇరుక్కోవడం అప్పట్లో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. అంతేకాక దాదాపుగా తెరకు దూరమైంది. శ్వేత భవిష్యత్ అంధకారం అవుతున్న దశలో కొంతమంది దర్శకులు ఆమెకు అవకాశాలిచ్చారు. దానితో పాటు కొన్ని హిందీ సీరియల్స్‌లోనూ ఛాన్సులిచ్చారు. ప్రస్తుతం చంద్రనందిని అనే హిందీ టీవీ సీరీస్‌లో నందిని అనే యువరాణి పాత్రలో నటిస్తోంది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియా నాటి సెక్స్ రాకెట్‌పై ప్రశ్నలు సంధించింది. ఆ సందర్భంలో మాట్లాడటానికి కాస్త నిరాకరిస్తూనే..తనకు ఎలాంటి సానుభూతి అవసరం లేదని అన్నారు. ప్రస్తుతం కెరీర్‌పై మాత్రమే తాను దృష్టి పెట్టానని చెప్పింది శ్వేతా. ఈ సీరియల్ తనకు లైఫ్ ఇస్తుందనే నమ్మకం తనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



