పవన్ మూవీ నుంచి సెకండ్ వికెట్ డౌన్...
on Sep 22, 2016

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా డిజాస్టర్ తర్వాత అభిమానులకు అదిరిపోయే హిట్టవ్వాలని ఫిక్స్ అయిన పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌కు అన్ని గండాలే ఎదురవుతున్నాయి. శరత్ మరార్ నిర్మాతగా ఎస్‌జె సూర్య దర్శకత్వంలో "కడపకింగ్" అనే మూవీ అనుకోవడం, ఆ వెంటనే ముహుర్తపు షాట్స్ జరుపుకోవడం అన్ని వేగంగా జరిగిపోయాయి. అయితే ఈ మూవీ డైరెక్టర్ ఎస్‌జె సూర్యకు నటుడిగా అవకాశాలు పోటెత్తడంతో ఏకంగా ప్రాజెక్ట్ నుంచే వైదొలిగడంతో అతని ప్లేస్‌లో డాలీ వచ్చి చేరాడు. డాలీ తన మార్క్‌తో స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు కూడా చేశాడు.
అనేక తర్జనభర్జనల తర్వాత సినిమాకు "కాటమరాయుడు" అని టైటిల్ ఫిక్స్ చేసి షూటింగ్‌కు ప్లాన్ చేసుకుంటున్న వేళ మరో షాక్ తగిలింది. ఈ చిత్ర కెమెరామ్యాన్ సౌందర్‌రాజన్ కూడా టాటా చెప్పేశాడు. షూటింగ్ రోజుకి రోజుకి ఆలస్యమవ్వడంతో సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు అతను ప్రకటించాడట. దీంతో సౌందర్ రాజన్ ప్లేస్‌లో ప్రసాద్ మూరెళ్లను కెమెరామ్యాన్‌గా తీసుకుంటున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. మొత్తానికి ఈ సినిమా షూటింగ్ కంప్లిట్ అయ్యే సరికి ఇంకెన్ని వికెట్లు డౌన్ అవుతాయో వేచి చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



