భరణిని ఆదుకునేవారెవ్వరు..?
on Nov 28, 2016
ఆస్కార్..ప్రపంచంలోని అన్ని భాషల్లో ఉన్న ప్రతీ ఇండస్ట్రీ కల. జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అందుకోని ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాలని ప్రతీ ఒక్క సినిమా టెక్నీషియన్‌కీ ఉంటుంది. ఎంతోమంది సినీ ప్రముఖులు ఇప్పటికే వారి మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు. ఆ లిస్ట్‌లో నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి కూడా ఉన్నారు. తాజాగా మరోసారి ఆ విషయాన్ని నలుగురి ముందు తన కలను చెప్పుకొచ్చారు భరణి. ఎప్పటికైనా ఓ ఇంటర్నేషనల్ మూవీ తీసి తెలుగోడిగా ఆస్కార్ అందుకొని ఆ వేదికపై తెలుగులో ప్రసంగించాలనేది నా కల అన్నారు. తాను తీయబోయే సినిమాకు కథ, డైలాగ్స్, స్క్రిప్ట్, డైరెక్టర్ అందరూ ఉన్నారు..కావాల్సిందిల్లా ఒక్కరే..ప్రోడ్యూసర్. ఎవరన్నా ఉంటే రండి అంటూ సరదాగా వ్యాఖ్యానించారు తనికెళ్ల. మరి నిర్మాతలారా భరణి మాటలు విన్నారా..?