వాళ్లపై అలీ సీరియస్ అయ్యాడు
on Nov 28, 2016
తెరపై నవ్వులు పూయించడంతో పాటు తెరమీద కూడా కడుపు చెక్కలయ్యేలా నవ్వించడంలో అలీ దిట్ట. ఆడియో ఫంక్షన్లు, సినిమా ఫంక్షన్లలో యాంకర్లపైనా..తోటి నటులపైనా సెటైర్లు..పంచ్‌లతో ఆ ఈవెంట్‌కొచ్చిన అందరిలో జోష్ తీసుకువస్తాడు అలీ. అలాంటి అలీ ఒక వేదికపై సడెన్‌గా సీరియస్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే..గుంటూరులో జరిగిన జాగ్ ముస్లిం..ఛలో గుంటూరు పేరిట నిర్వహించిన సభకు అలీ హాజరయ్యాడు.
ఈ సందర్భంగా రాజకీయ పార్టీలను ఏకీపారేశాడు. నాయకులు టోపీలు పెట్టుకుంటూ తిరగటమే కాదు..ముస్లింలకు టోపీలు పెడుతున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు ఏ పార్టీ అయితే ఎక్కువ సీట్లు కేటాయిస్తుందో ఆ పార్టీకే ముస్లింలు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. ఏదో నాలుగు సెటైర్లు, జోకులు పేల్చి నవ్విస్తాడనుకుంటే ఇలా చేశాడేంటి అని అక్కడికొచ్చిన జనం ముక్కున వేలేసుకున్నారు. కొంతమంది మాత్రం అలీ చాలా బాగా మాట్లాడాడని మెచ్చుకున్నారు.