రామ్‌చరణ్‌తో సమంత?
on Nov 28, 2016
మెగా హీరో రామ్‌చరణ్ పక్కన సమంత కథానాయికగా నటిస్తోందా? వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. రామ్‌చరణ్ - సుకుమార్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పల్లెటూరు నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. ఈ చిత్రంలో కథానాయికగా సమంతని ఎంచుకొన్నారని తెలుస్తోంది. ముందు ఈ పాత్ర కోసం రాశీఖన్నా పేరు పరిశీలించారు. ఆమెనే కథానాయికగా తీసుకొన్నారని వార్తలొచ్చాయి. అంతలో ఏమైందో..... హీరోయిన్ మారిపోయింది. అ..ఆ తరవాత కొత్త సినిమాలపై సంతకాలు చేయలేదు సమంత. నాగచైతన్యతో పెళ్లి కుదిరాక.. సమంత ఓ సినిమా ఒప్పుకోవడం ఇదే తొలిసారి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబరు చివరి వారంలో సెట్స్‌పైకి వెళ్తుంది.