తమన్నా సినిమాకి 8 ఏళ్ళ తర్వాత మోక్షం లభించింది. రిలీజ్ ఎప్పుడంటే..?
on Jan 2, 2024
ప్రతి ఏడాది టాలీవుడ్‌లో 100కి పైగా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ప్రతి సంవత్సరం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు అంతకు రెట్టింపు ఉంటాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలన్నీ రిలీజ్ అవుతాయన్న గ్యారెంటీ లేదు. కొన్ని సినిమాలు ఫస్ట్‌కాపీకే పరిమితమవుతాయి. మరికొన్ని ల్యాబ్‌లలో మగ్గిపోతూ ఉంటాయి. ఈ పరిస్థితి ఇప్పటిది కాదు. సినిమా పుట్టిన దగ్గర నుంచి ఉంది. 40, 50 సంవత్సరాల క్రితం పూర్తయి ఇప్పటికీ రిలీజ్ అవ్వని సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే కొన్నింటికి మోక్షం లభిస్తుంటుంది. చాలా లేట్‌గా అయినా రిలీజ్ అవుతాయి.
ఇప్పుడు అలాంటి ఓ సినిమా రిలీజ్‌కి సిద్ధమైంది. అయితే అది కొత్త తారలతోనో, ఊరు పేరు లేని దర్శకుడితోనే చేసిన సినిమా కాదు. మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా ఆ సినిమాలో హీరోయిన్. అంతేకాదు, అ, కల్కి, జాంబిరెడ్డి వంటి విభిన్నమైన సినిమాలను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ ఆ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా పేరు ‘దటీజ్ మహాలక్ష్మీ’. తాజాగా ప్రశాంత్‌వర్మ డైరెక్షన్‌లో రూపొందిన ‘హనుమాన్’ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే రిలీజ్ చేయకుండా పక్కన పెట్టిన ‘దటీజ్ మహాలక్ష్మీ’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. 2014లో ఈ సినిమాను ఎనౌన్స్ చేశారు. 2016లో షూటింగ్ పూర్తయింది. కానీ, అప్పట్లో కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేకపోయారు. సౌత్ రీమేక్ రైట్స్ విషయంలో వచ్చిన కొన్ని వివాదాలే రిలీజ్ కాకపోవడానికి కారణం. సినిమా పూర్తయిన తర్వాత ఇంత ఆలస్యంగా థియేటర్‌లోకి సినిమాని తీసుకొస్తే ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం లేదు. అందుకే నెట్‌ఫ్లిక్స్‌తో నిర్మాతలు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంలో త్వరలోనే క్లారిటీ రానుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
