ఎన్టీఆర్ దేవర 25 కోట్లు అంటున్న నిర్మాతలు? లెక్కలు చెప్తున్న ఫ్యాన్స్
on Jan 2, 2024
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వింటే చాలు ఆయన అభిమానులు పూనకం వచ్చిన వాళ్ళల్లా ఊగిపోతారు. నూనూగు మీసాల వయసు నుంచే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులు సృష్టించిన ఎన్టీఆర్ ఇప్పుడు తన నయా మూవీ దేవర రిలీజ్ కాకుండానే సరికొత్త రికార్డు సృష్టించాడు.
ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం దేవర. ఏప్రిల్ 5 న విడుదల కాబోతున్న ఈ మూవీకి సంబంధించి సీడెడ్ (రాయలసీమ) హక్కులని 25 కోట్లు చెప్తున్నారనే ప్రచారం చాలా బలంగా వినపడుతుంది. సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ ని చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే రాయలసీమలో ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా మొదటి మూడు రోజుల్లోనే ఆ మొత్తం వచ్చేస్తుందని అంటున్నారు. అభిమానుల లెక్కల ప్రకారం మొదటి రోజు 10 కోట్లు దాకా షేర్ వస్తుందని ఆ తర్వాత రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా దాటుతుందని అంటున్నారు.ఏది ఏమైనా దేవర రాయలసీమలో 25 కోట్ల బిజినెస్ ని జరుపుకుంటే మాత్రం తెలుగు సినిమా చరిత్రలోనే దేవర ఒక సరికొత్త రికార్డుని సృషించినట్టే..
ఇక రాయలసీమ ఏరియా విషయానికి వస్తే సినిమాల పరంగా ఆ ఏరియా ఎన్టీఆర్ అడ్డా. ఎందుకంటే సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ సినిమాలు రాయలసీమలో రికార్డు కలెక్షన్స్ ని సాధిస్తాయి. అంతే కాకుండా ఇప్పటి వరకు సీడెడ్ ఏరియాలో టాప్ కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్ తీస్తే అందులో ఎన్టీఆర్ సినిమా తప్పకుండా ఉంటుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
