రిషి సార్... మన హ్యాట్రిక్ అలాగే ఉండిపోయింది
on Apr 30, 2020

ఈతరం కథానాయికలలో రిషి కపూర్ తో కలిసి రెండు చిత్రాలలో నటించిన భామలలో తాప్సీ ఒకరు. హిందీ చిత్ర పరిశ్రమకు ఆమె కథానాయికగా పరిచయమైన 'చష్మే బద్దూర్'లో రిషి కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. అలాగే, రెండేళ్ల క్రితం వచ్చిన 'ముల్క్'లో ఇద్దరూ మామ కోడళ్లుగా కనిపించారు. అందులో రిషీకపూర్ ముస్లిం అయితే... తాప్సీ హిందువు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణను చూరగొంది. రిషి కపూర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో తాప్సీ భావోద్వేగ భరిత పోస్ట్ ఒకటి చేశారు. "సార్... మన హ్యాట్రిక్ అలాగే ఉండిపోయింది" అని ఆమె అన్నారు. కృషి తో దిగిన ఫోటోలు పోస్ట్ చేశారు.
"రిషి కపూర్ సార్ తో నేను దిగిన ఫోటోలలో నాకు అత్యంత ఇష్టమైన ఫోటో ఇది. ఆయనతో కలిసి రెండు సార్లు పని చేశా. చాలా నిజాయితీగా ఆయన ఇచ్చే కాంప్లిమెంట్స్ ఎప్పటికీ నా మనసు, మెదడు నుంచి వెళ్ళవు. ఆయన మనల్ని ఆటపట్టించినా... అందులో ఒక ప్రేమ ఉంటుంది. అందుకని ఆయన చెప్పే మాటల్ని విని ఎంజాయ్ చేయకుండా ఉండలేను. ఎంటర్టైనింగ్ స్టోరీస్ ఎన్నో ఆయన చెబుతారు. అత్యంత నిజాయితీగా ఉండడం లో నన్ను ఓడించగల ఏకైక కోస్టార్ ఆయనే. సార్... మన హ్యాట్రిక్ అలాగే ఉండిపోయింది. తప్పకుండా మనం మళ్లీ ఎక్కడోచోట కలుస్తాం... మన ముఖాలపై ఇదే చిరునవ్వుతో ఇదే హాగ్ రిపీట్ అవుతుంది" అని తాప్సీ పేర్కొన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



