నితిన్ 'పవర్ పేట'లో 'రౌడీ ఫెలో' విలన్
on May 1, 2020
గేయ రచయిత కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయమైన చిత్రం 'రౌడీ ఫెలో' గుర్తుందా? ఇందులో ప్రతినాయకుడి పాత్రలో నటించిన టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ ఉన్నారు కదా! ఇప్పుడు ఆయన నితిన్ 'పవర్ పేట'లో కీలక పాత్రలో నటించనున్నారు. ఈ మాత్రం విషయం చెప్పడానికి నితిన్ 'పవర్ పేట'లో 'రౌడీ ఫెలో' విలన్ అనడం ఎందుకు? రావు రమేష్ అంటే సరిపోతుంది కదా!? అని కొందరికి సందేహం రావచ్చు.
'రౌడీ ఫెలో'కి దర్శకత్వం వహించిన కృష్ణ చైతన్య ఈ 'పవర్ పేట'కు దర్శకుడు. ఈ సినిమా కథ రాసేటప్పుడు రావు రమేష్ ను ఊహించుకొని ఒక పాత్ర రాశారట. అందుకని, దానికి ఆయనే తీసుకున్నారు. దర్శకుడిగా కృష్ణ చైతన్య రెండో సినిమా 'చల్ మోహనరంగా'లో కూడా రావు రమేష్ కీలక పాత్ర పోషించారు. 'పవర్ పేట' విషయానికి వస్తే రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో కీర్తి సురేష్ కథానాయక. నటులు సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఐదు పాత్రల చుట్టూ సినిమా కథ తిరుగుతుందని తెలిసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
