దిగ్భ్రాంతికి గురైన చిత్ర పరిశ్రమ! కన్నీరు పెట్టుకున్న అమితాబ్!
on Apr 30, 2020

ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ మరణంపై ప్రముఖులు శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు అమితాబచ్చన ఒక్కసారే షాక్ తిన్నానని.. మంచి స్నేహితుడుని కోల్పోయానని.. ఇప్పటికీ నమ్మలేక పోయని ఈ వార్త విని కుప్పకూలిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరారు. ఈ ఘటనతో బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
దాదాపు రెండున్నర దశాబ్దాలుగా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఆయన అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్నారు.
డింపుల్ కపాడియాతో కలిసి బాబితో తొలి సినిమాలో ఆయనకు లవర్ బాయ్ ఇమేజ్ వచ్చింది. బాబి సినిమాను అప్పట్లో యువత ఎన్నిసార్లు చూసేవారో లెక్కలేదని ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు.
తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. రిషీ కపూర్ గొప్ప నటుడు మాత్రమే కాదని, చాలా మంచి మనిషి కూడా అని ఆయన పేర్కొన్నారు. రిషీ కపూర్ మరణం బాలీవుడ్‌కు తీరని లోటని అభిప్రాయపడ్డారు. రిషికపూర్ కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు తాను మనసారా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని జవదేకర్ పేర్కొన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



