దృష్టి లోపమున్న యువతిగా తాప్సీ!
on Jul 5, 2021

తాప్సీ అంటే ఒకప్పుడు కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే. కట్ చేస్తే.. ఇప్పుడు సీన్ మారింది. డిఫరెంట్ రోల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా తాప్సీ నిలుస్తోంది. ఒకదానితో ఒకటి పొంతన లేని పాత్రలు ఎంచుకుంటూ..
తరుచుగా వార్తల్లో నిలుస్తోంది ఈ ఉత్తరాది సోయగం.
ఈ క్రమంలోనే తాప్సీ తాజాగా ఓ స్పానిష్ మూవీ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో దృష్టి లోపమున్న కవల సోదరి పాత్రలో తాప్సీ దర్శనమివ్వనుంది. ఒరిజినల్ వెర్షన్ `జూలియస్ ఐస్` (2010)లో
బెలెన్ రైడా పోషించిన వేషంలో తాప్సీ సందడి చేయనుంది. అంతేకాదు.. ఈ పాత్ర కోసం తాప్సీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందట. బాలీవుడ్ నేటివిటికి తగ్గట్టు తీర్చిదిద్దుతున్న ఈ రీమేక్ ని `సెక్షన్ 375`తో
విమర్శకుల ప్రశంసలు అందుకున్న అజయ్ భాల్ తెరకెక్కిస్తున్నారు. అలాగే, బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవాయ్ ఇందులో మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. జూలై 20 నుంచి నైనిటాల్ లో ఈ సినిమాకి
సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనం ముందుకు రానుంది. మరి.. దృష్టి లోపమున్న యువతిగా తాప్సీ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
కాగా, ప్రస్తుతం తాప్సీ చేతిలో `రష్మీ రాకెట్`, `లూప్ లపేటా`, `దోబారా`, `శభాష్ మిథు` వంటి క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరోవైపు దక్షిణాదిలోనూ రెండు సినిమాల్లో సందడి చేయనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



