మహేశ్ బర్త్ డేకి `సర్కారు..` సందడి
on Jul 5, 2021

హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ప్రస్తుతం `సర్కారు వారి పాట` పేరుతో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. `గీత గోవిందం` వంటి సంచలన విజయం తరువాత పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కొంతమేర చిత్రీకరణ పూర్తయింది. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్ వేసిన యూనిట్.. ఈ నెల 15 నుంచి షూటింగ్ ని పునః ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోందట.
ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న `సర్కారు వారి పాట` టీజర్ వస్తుందని అంతా ఎదురుచూశారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ ముచ్చట నెరవేరలేదు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న `సర్కారు వారి పాట` టీజర్ ని రిలీజ్ చేసే ఆలోచనతో చిత్ర బృందం ఉందట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
కాగా, `సర్కారు వారి పాట`కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు. 2022 సంక్రాంతికి `సర్కారు వారి పాట`ని తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



