రాధికకు ఆ టైపు సినిమాలంటేనే ఇష్టమట..?
on Sep 23, 2016

రక్త చరిత్ర, లెజెండ్, లయన్ వంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది మరాఠీ ముద్దు గుమ్మ రాధికా ఆప్టే. ఇటీవల పర్చేద్ సినిమాలో హాట్ హాట్ సన్నివేశాలతో మరింత రెచ్చిపోయి హోమ్‌లి ఇమేజ్‌ను చేరిపేస్తూ.. సౌత్‌లో స్వీటీగా, నార్త్‌లో నాటీగా గుర్తింపు పొందింది రాధిక. ఇలాంటి వార్తలతో మీడియాలో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ, తనకు ఆ టైపు సినిమాలంటేనే ఇష్టమంటూ కామెంట్స్ చేసింది. ఆ టైపు సినిమాలు అంటే రాధిక వర్షన్‌లో షార్ట్ ఫిల్మ్స్ అన్నమాట. వాటిలో నటించడమే ఆమెకు చాలా ఇష్టమట. పెద్ద సినిమాల్లో ఛాన్సులు లేనపుడు ఖాళీగా లేకుండా ఇలాంటి చిత్రాలే చేస్తానంటోంది. అంతేకాదు షార్ట్ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేయడం ఆర్టిస్టులకు కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటుందని, వీటికి ఎక్కువ సమయం కూడా పట్టదట. ఇప్పటికే అహల్య అనే పొట్టి సినిమాలో అందాల విందు చేసిన ఈ బోల్డ్ బ్యూటీ, తాజాగా సుజయ్ ఘోష్ షార్ట్ ఫిల్మ్‌లో నటిస్తోందట. మొత్తానికి పొట్టి సినిమాలపై తన మనసులో మాటను బయటపెట్టింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



