రాశీ ఖన్నా పై హీరో నాని కొంటె వ్యాఖ్య..!
on Apr 15, 2016

స్టేజ్ పై మాట్లాడేప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండే హీరోల్లో నాని కూడా ఒకరు. వీలైనంత వరకూ క్లుప్తంగా, అచి తూచి మాట్లాడే నాని, నిన్న జరిగిన సుప్రీమ్ ఆడియో ఫంక్షన్లో మాత్రం నోరు జారాడు. హీరోయిన్ రాశి ఖన్నా పై కొంటె వ్యాఖ్యలు చేశాడు. సుప్రీమ్ లో చిరంజీవి పాత పాట అందం హిందోళం సాంగ్ ను రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ చూసిన వెంటనే నానికి రెండు సార్లు విజిల్ వేయాలనిపించిందట. ఒకసారి చిరంజీవి గారి పాట కాబట్టి, ఇంకో విజిల్ రాశి ఖన్నా నడుము కోసం అంటూ నాని అనగానే కాస్త షాక్ అయినా, వెంటనే తేరుకుని అందరూ నవ్వేశారు. రాశి కూడా నాని వ్యాఖ్యల్ని కాంప్లిమెంట్ గా తీసుకుని చిరునవ్వులు చిందించడంతో అంతా సవ్యంగా సాగిపోయింది. సినిమా పెద్ద హిట్ కావాలని, త్వరలోనే దిల్ రాజుతో తన సినిమా కూడా ఉంటుందన్నాడు నాని. దిల్ రాజు నిర్మాణంలో, అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సుప్రీమ్ మే 6 న రిలీజ్ కు సిద్ధమవుతోంది. సినిమాలో రాశి ఖన్నా పోలీస్ గెటప్ లో కామెడీ చేయడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



