సుప్రీమ్ ట్రైలర్ రివ్యూ ..!
on Apr 15, 2016

సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా జోడీగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సుప్రీమ్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, న్యాచురల్ స్టార్ నాని కలిసి నిన్న జరిగిన ఆడియో ఫంక్షన్లో ట్రైలర్ ను విడుదల చేశారు. సినిమా పక్కా కమర్షియల్ అండ్ యాక్షన్ మూవీ అని అర్ధమయ్యేలాగే ట్రైలర్ కట్ చేశారు. పటాస్ ను కామెడీ ప్రధానంగా తెరకెక్కించి, అనిల్ హిట్ కొట్టేశాడు. అందుకే సుప్రీమ్ లో కూడా ప్రధానంగా కామెడీపైనే దృష్టి పెట్టాడు. సాయి ధరమ్ తేజ్ ఎక్స్ ప్రెషన్స్ చాలా డెవలప్ అయినట్టే అనిపిస్తోంది. డైలాగ్ డెలివరీలో, యాక్టింగ్ లో చాలా ఈజ్ చూపించాడు. ఫైట్స్, డ్యాన్స్ ల్లో కూడా సాయి పెర్ఫామెన్స్ బాగా ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తోంది. ట్రైలర్లో బాగా ఆకర్షించే పాత్ర రాశీఖన్నా. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలన్నింటిలోనూ, హీరోయిన్లంటే కేవలం అందాల ప్రదర్శనకు మాత్రమే అన్నట్టు తీసుకుంటున్నారు. కానీ సుప్రీమ్ ట్రైలర్ రాశి ఖన్నా కామెడీని పండించిన విధానం చూస్తే ఆమెకు ఈ పాత్ర చాలా పేరు తెచ్చిపెడుతుందనడంలో డౌట్ లేదు. సినిమాకు ఆమె కామెడీయే హైలెట్ అని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. పటాస్ లో కామెడీ టీం నే ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేశాడు దర్శకుడు. ఓవరాల్ గా సుప్రీమ్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్టు కనిపిస్తోంది. మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చేలా ట్రైలర్ కట్ చేయడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



