మహేశ్‌ను చూసి బాలీవుడ్ నిర్మాత గుండెల్లో గుబులు..?
on Aug 18, 2017
గతంలో తెలుగు సినిమా మార్కెట్ అంటే తెలుగు రాష్ట్రాలు..కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు మాత్రమే. అయితే మిగిలిన భాషల హీరోలు తమ సొంత మార్కెట్‌తో పాటు వేరే భాషల్లో కూడా మార్కెట్‌ను పెంచుకుంటున్నారు. వాళ్లను చూసి నేర్చుకున్నారో లేక మరేదైనా కారణమో కానీ మన హీరోలు కూడా ఇప్పుడు మార్కెట్‌ను పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. సమకాలీన హీరోలతో పోలిస్తే..నేషనల్ వైడ్‌గా పాపులారిటీ ఉన్న సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తోన్న స్పైడర్ మూవీని తెలుగుతో పాటు తమిళ్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అలాగే హిందీ, మలయాళీ భాషల్లోనూ డబ్ చేసి విడుదల చేయాలని పెద్ద స్కెచ్చే గీస్తున్నాడు.
అయితే తమిళ, మలయాళ భాషల్లో ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ బాలీవుడ్‌లో మాత్రం మహేశ్ ప్రయత్నానికి ఆటంకాలు ఎదురువుతున్నాయట. ముఖ్యంగా హిందీ దర్శకనిర్మాత కరణ్ జోహర్ అక్కడ పెద్ద అడ్డంకిగా మారాడట. స్పైడర్‌ను ఆయన హృతిక్ రోషన్‌తో రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. అందుకే ఈ మూవీని హిందీలో రిలీజ్ చేయొద్దని స్పైడర్ నిర్మాతల్ని పట్టుబడుతున్నాడట. కానీ స్పైడర్‌ని రీమేక్ చేసే విషయంలో హృతిక్ రోషన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో..త్వరగా నిర్ణయం చెప్పాలని స్పైడర్ మేకర్స్ కోరుతున్నారట. 120 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తేనే మంచి రాబడి ఉంటుంది. మరి కరణ్ ఏమో వద్దంటున్నాడు..ఆయన్ను కాదని హిందీలో రిలీజ్ చేసే సాహసం స్పైడర్ నిర్మాతలు చేయగలరా..? ఈ విషయంపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.