లొకేషన్లోకి ఇద్దరూ ఎంటరయ్యారు!
on Aug 18, 2017
అయిదేళ్లు ‘బాహుబలి’కే అంకితం అయిపోయాడు ప్రభాస్. నటుడనేవాడు... ఒకే పాత్రతో అన్ని రోజులు కాపురం చేయడం నిజంగా నరకరమే. ‘బాహుబలి’ ప్రభాస్ కి అంతర్జాతీయ గుర్తింపునిచ్చి ఉండొచ్చు... కానీ... ఇబ్బంది ఇబ్బందే. అందులో నో డౌట్.
మళ్లీ ఇన్నాళ్లకు మరో పాత్రలోకి టర్న్ అయ్యాడు యంగ్ రెబల్ స్టార్. ఈ రోజే ఆయన ‘సాహో’ షూటింగ్ లోకి ఎంటరయ్యాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై.. చాలారోజులైనా... ఇప్పటిదాకా ప్రభాస్ లేని సన్నివేశాలను తీసుకుంటూ వెళ్లాడు దర్శకుడు సుజిత్. ఈ రోజు నుంచి ప్రభాస్, శ్రద్ధా కపూర్ ‘సాహో’షూటింగ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక లొకేషన్ మొత్తం సందడే సందడి.
ఈ సినిమాకి ప్రభాస్, శ్దద్ధ తీసుకుంటున్న పారితోషికాలపై ఫిలింనగర్ లో పెద్ద చర్చే నడుస్తోంది. భారీ స్థాయిలో వీరి పారితోషికాలున్నట్లు టాక్. ఇదిలావుంటే... శ్రద్ధ కపూర్ కి మాత్రం టాలీవుడ్ నుంచి ఘన స్వాగతమే లభించిందనే చెప్పాలి. సోషల్ మీడియా ద్వారా శ్రద్ధాకపూర్ కి వెల్ కమ్ చెబుతూ... ప్రభాస్ అభిమానులు లక్షల సంఖ్యలో కామెంట్లు పెట్టారు. దీంతో ఈ ముంబయ్ ముద్దుగుమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ‘టాలీవుడ్ లోకి ఎంటర్ అవ్వడమే పూర్వ జన్మ సుకృతం అనుకుంటుంటే... ఇంత గ్రాండ్ వెల్ కమ్ లభించడం నిజంగా చెప్పలేనంత ఆనందంగా ఉంది.. థ్యాంక్యూ సో మచ్’ అంటూ తను కూడా ట్వీట్ చేసింది శ్రద్ధా.