బ్రహ్మోత్సవం మహేశ్‌ని ఇంతలా మార్చిందా..?
on Dec 1, 2016
శ్రీమంతుడు లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సినిమా, అల్రెడీ అదే డైరెక్టర్‌తో వర్క్ చేసిన అనుభవం, స్టార్ హీరోయిన్లు.. ఇవి చాలు ఒక సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉండటానికి కానీ రిజల్ట్ చూస్తే డిజాస్టర్. సూపర్‌స్టార్ మహేశ్ బాబు కెరిర్‌లోనే చేదు జ్ఞాపకం. గతంలోనూ ప్రిన్స్‌కి ఫ్లాపులున్నా బ్రహ్మోత్సవం రేంజ్ షాక్ ఎప్పుడూ తగల్లేదు. అలాగే బ్రహ్మోత్సవంపై చాలా ఆశలు పెట్టుకున్న ఆ చిత్ర నిర్మాణ సంస్థ పీవీపీని కూడా పీకల్లోతు నష్టాల్లో ముంచింది. అయితే మహేశ్‌తో మరో సినిమా చేసి ఆ నష్టాన్ని పూడ్చుకోవాలని చూసిన పీవీపీకి షాకిచ్చాడు సూపర్‌స్టార్.
ప్రస్తుతం మురగదాస్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు మహేశ్..దాని తర్వాత కొరటాల శివతో సినిమా ఎనౌన్స్ చేశాడు..ఈ రెండింటి తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పీవీపీ నిర్మాణంలో మహేశ్ సినిమా చేయాల్సి ఉంది. అయితే, ఆ సినిమాకు పీవీపీని తప్పించి దిల్‌రాజును నిర్మాతగా తీసుకున్నాడట మహేశ్. ప్రజల్లో దిల్‌రాజు సినిమాలకు మంచి పేరు ఉండటం, అలాగే గతంలో తనతో తీసిని సీతమ్మవాకిట్లో సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పీవీపీని తప్పించి దిల్‌రాజును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.