గుమ్మడికాయ కొట్టేసిన `గౌతమిపుత్ర శాతకర్ణి`
on Dec 1, 2016
నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన హిస్టారికల్ 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`.నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వాల్యూస్ , భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ ప్రెస్టీజియస్ చిత్రం నిన్నటితో చిత్రీకరణ పూర్తి చేసుకుని గుమ్మడియకాయ వేడుకను పూర్తి చేసుకుంది. రామోజీ ఫిలింసిటీలో నందమూరి బాలకృష్ణ, శ్రేయా, హేమామాలినిపై దర్శకుడు క్రిష్ చివరి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
నిర్మాతలు జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ - ``గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను ఏప్రిల్ 8, 2016లో ఉగాది పర్వదినాన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అనౌన్స్ చేశాం. అలాగే హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్, మంత్రి హరీష్ రావు, దాసరి నారాయణరావు, చిరంజీవి, వెంకటేష్, రాఘవేంద్రరావు సహా పలువురి సినీ ప్రముఖుల సమక్షంలో లాంచనంగా సినిమాను ప్రారంభించాం. చిత్రీకరణలో భాగంగా మొరాకోలోని అట్లాస్ స్టూడియోలో వార్ సీక్వెన్స్‌తో మొదటి షెడ్యూల్‌ను స్టార్ట్ చేశాం. 1000 జూనియర్ ఆర్టిస్టులు, 200 గుర్రాలతో ఈ షెడ్యూల్ చిత్రీకరించాం. రోజులో 14 నుండి 16 గంటల పాటు ఏకధాటిగా షూటింగ్ చేశాం. అలాగే చిలుకూరి బాలాజీ ఆలయ సమీపంలో మే 30 నుండి భారీ యుద్ధ నౌక సెట్ వేసి రెండో షెడ్యూల్‌ను చిత్రీకరించాం.
జార్జియాలో మూడో షెడ్యూల్ షూటింగ్ చేశాం. జూలై 4న జార్టియాలో మౌంట్ కెజ్‌బెగ్‌లో ప్రారంభమైన ఈ షెడ్యూల్‌లో క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించాం. శాతవాహన సైనికులకు, గ్రీకు సైనికులకు మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలను ఇందులో భాగంగా చిత్రీకరించడం జరిగింది. 1000 జానియర్ ఆర్టిస్టులు, 300 గుర్రాలు, 20 రథాలతో ఈ షెడ్యూల్ చిత్రీకరణ జరిపాం. నాలుగో షెడ్యూల్‌ను ఆగస్ట్ 29న నుండి సెప్టెంబర్ 20 వరకు మధ్యప్రదేశ్‌లో చిత్రీకరించాం. ఇందులో రాజసూయ యాగ సన్నివేశాలు, సహా కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ నటించిన సన్నివేశాలు సహా చిన్న చిన్న ప్యాచ్ వర్క్‌లను, బృంద మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ సాంగ్‌ను చిత్రీకరించాం.
సినిమా ఫస్ట్‌లుక్ నుండి పోస్టర్స్, టీజర్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ మూడు మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకోవడం విశేషం. గౌతమిపుత్ర శాతకర్ణి వంటి హిస్టారికల్ చిత్రాన్ని రూపొందించడం చిన్న విషయం కాదు. మా జీవితకాలం గుర్తుండిపోయే సినిమా ఇది. నందమూరి బాలకృష్ణ సహా ఎంటైర్ టీం సపోర్ట్‌తో సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేయగలిగాం. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. తెలుగు ప్రేక్షకులు, అభిమానులే కాదు, మీడియా కూడా ఎంతో అండగా నిలిచినందుకు వారికి కూడా థాంక్స్.
అలాగే ఇంత గొప్ప సినిమాను 79 రోజుల్లో పూర్తి చేశామంటే అందుకు ప్రేక్షకులు, అభిమానులతో పాటు డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ ఇచ్రిన ఎనర్జీయే కారణం. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. సినిమా చూసే ప్రేక్షకుడికి గౌతమిపుత్ర శాతకర్ణి ఓ విజువల్ వండర్‌లా ఉంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను జనవరి రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, హేమామాలిని, శ్రేయ, కబీర్ బేడి తదితరలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతంః చిరంతన్ భట్, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.