అమెజాన్ ప్రైమ్ వీడియోలో అమితంగా అలరిస్తోన్న 'తెలుగువన్' సినిమాలు!
on Dec 22, 2021

యూట్యూబ్ చానల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను నాణ్యమైన సినిమాలతో అలరిస్తూ వస్తోన్న 'తెలుగువన్', ఇప్పుడు ఓటీటీ దిగ్గజం 'అమెజాన్ ప్రైమ్ వీడియో' ద్వారా కొన్ని చక్కని సినిమాలను వీక్షకులకు అందిస్తోంది. అన్ని జానర్‌లకు సంబంధించిన బ్లాక్‌బస్టర్ సినిమాలకు నిలయమైన తెలుగువన్ నుంచి కొన్ని ఆల్‌టైమ్ ఫేవరేట్ మూవీస్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్నాయి.
వాటిలో కమల్‌హాసన్ హీరోగా కె. బాలచందర్ సృష్టించిన క్లాసిక్ ఫిల్మ్ 'మరో చరిత్ర', జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి తెరపై ప్రధాన పాత్ర పోషించిన.. అదీ శ్రీరామునిగా నటించిన 'రామాయణము', చిరంజీవి డ్యూయల్ రోల్ చేసిన హిట్ ఫిల్మ్ 'స్నేహం కోసం', నాగార్జునకు నటునిగా మంచి పేరు తేవడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన 'నువ్వు వస్తావని', 'స్నేహమంటే ఇదేరా' సినిమాలు, వెంకటేశ్ వైవిధ్యమైన పాత్రలో అలరించిన హిట్ ఫిల్మ్ 'శీను', రవితేజ మరపురాని చిత్రం నా ఆటోగ్రాఫ్.. స్వీట్ మెమరీస్, సురేందర్‌రెడ్డి డైరెక్టర్‌గా పరిచయం చేసిన నందమూరి కల్యాణ్‌రామ్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన 'అతనొక్కడే', నవ్వుల రారాజు రాజేంద్రప్రసాద్ సూపర్ హిట్ ఫిల్మ్ 'ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్' సినిమాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో వీక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటుండగా, మరికొన్ని కొత్తగా స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి.
ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఈ చక్కని సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేసేయండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న తెలుగువన్ సినిమాలివే...
మరో చరిత్ర - కమల్ హాసన్, సరిత
స్నేహం కోసం - చిరంజీవి, మీనా
నువ్వు వస్తావని - నాగార్జున, సిమ్రాన్
రామాయణము - జూనియర్ ఎన్టీఆర్, స్మిత
అతనొక్కడే - కల్యాణ్‌రామ్, సింధు తులాని
నా ఆటోగ్రాఫ్.. స్వీట్ మొమరీస్ - రవితేజ, భూమిక, గోపిక
స్నేహమంటే ఇదేరా - నాగార్జున, సుమంత్, భూమిక
శీను - వెంకటేశ్, ట్వింకిల్ ఖన్నా
ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ - రాజేంద్రప్రసాద్, దివ్యవాణి

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



