ఐదేళ్ళ తరువాత వేసవి బరిలో వెంకీ!
on Dec 22, 2021

సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ కి కలిసొచ్చిన సీజన్స్ లో వేసవి ఒకటి. `ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు` (1996), `ప్రేమించుకుందాం.. రా!`(1997), `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే`(2007), `గురు` (2017).. ఇలా వెంకీ కెరీర్ లో మెమరబుల్ మూవీస్ గా నిలిచిన పలు చిత్రాలు సమ్మర్ సీజన్ లోనే సందడి చేశాయి.
ఇదిలా ఉంటే.. `గురు` తరువాత మళ్ళీ వేసవి బరిలో దిగని వెంకటేశ్.. ఐదేళ్ళ తరువాత `ఎఫ్ 3`తో పలకరించేందుకు సిద్ధమయ్యారు. 2019 సంక్రాంతి సెన్సేషన్ `ఎఫ్ 2`కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్.. 2022 వేసవి కానుకగా ఏప్రిల్ 29న రిలీజ్ కాబోతోంది. మరి.. ఐదేళ్ళ తరువాత వేసవిలో వినోదాలు పంచనున్న వెంకీ.. ఈ సారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.
కాగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న `ఎఫ్ 3`లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో వెంకీకి జోడీగా తమన్నా నటిస్తుండగా.. వరుణ్ తేజ్ కి జంటగా మెహ్రీన్ దర్శనమివ్వనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్న ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



