శృంగార కథలు రాస్తున్న సన్నీ లియోన్..!
on Apr 23, 2016

ఒకప్పుడు పోర్న్ సినిమాలో నటించిన సన్నీ లియోన్, ఆ తర్వాత రూట్ మార్చుకుని బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అడల్ట్ కామెడీ సినిమాలు చేస్తూ, షారుఖ్ సరసన డ్యాన్స్ వేసే స్థాయికి చేరుకుంది. తాజాగా, తనలో నటి మాత్రమే కాక, మంచి రచయిత కూడా ఉందని నిరూపించుకోవాలనుకుంటోంది. రచయిత అంటే ఏ నవలలో రాస్తుందేమో అనుకుంటున్నారా. ఆమె ఆ రేంజ్ రచయిత్రి కాదు గానీ, శృంగార రస ప్రధానమైన కథల్ని రాయాలని మాత్రం డిసైడ్ అయిందట. ఇప్పటికే పోర్న్ రంగంలో ఉన్న అనుభవాన్ని రంగరించి, స్త్రీలకు నచ్చే విధంగా కథల్ని రిలీజ్ చేస్తున్నానని ప్రకటించింది. 12 కథల వరకూ ఉన్న ఈ సీరీస్ కు స్వీట్ డ్రీమ్స్ అని పేరు పెట్టింది. ఈ కథల్ని జగ్గర్ నాట్ అనే మొబైల్ యాప్ లో డైలీ అప్ డేట్ చేస్తారు. స్వయంగా సన్నీ రాసిన కథలు కావడంతో, వీటికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంటుందని జగ్గర్ నాట్ కంపెనీ భావిస్తోంది. శృంగార కథలు కాబట్టి అవి మరీ చదవలేనట్టుగా ఉంటాయని భావించద్దని, ముఖ్యంగా మహిళలకోసమే తాను ఈ కథల్ని రాశానని, శృంగారంలో స్త్రీ పురుష సమానత్వం ఉండాలంటూ నీతులు చెబుతోంది సన్నీ లియోన్. కథలు రాసి కూడా డబ్బు సంపాదిస్తున్న సన్నీ లియోన్ చాలా తెలివైంది అంటున్నారు హిందీ జనాలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



