మెగాస్టార్ కత్తి స్క్రిప్ట్ ఎక్సలెంట్ గా కుదిరిందట..!
on Apr 23, 2016

మెగా 150 మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు మెగాభిమానులు. షూటింగ్ మొదలైందన్న అనౌన్స మెంట్ వచ్చినా, వాళ్ల అనందానికి హద్దుండదు. కానీ పెర్ఫెక్షన్ ను కోరుకునే చిరు, వివి వినాయక చేతుల్లో పెట్టిన స్క్రిప్ట్ వర్క్ పూర్తిగా పక్కాగా ఫైనల్ అయిన తర్వాతే ముందడుగు వేద్దామని చూస్తున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ కు ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే, స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయిందట. అంతేకాక వినాయక్ టోటల్ గా తయారుచేసిన స్క్రిప్ట్ మెగాస్టార్ కు కూడా అద్భుతంగా నచ్చేసిందట. బాలయ్య శాతకర్ణి ఓపెనింగ్ సమయంలో చిరు ఈ విషయాన్ని సన్నిహితుల దగ్గర చర్చించారట. స్క్రిప్ట్ చాలా బాగా కుదిరిందని, తనకు విపరీతంగా నచ్చేసిందని చిరు అంటున్నారట. కత్తి ఒరిజినల్ విజయ్ కు తగ్గట్టుగా ఉంటే, దాన్ని చిరు బాడీ లాంగ్వేజ్ అండ్ ఇమేజ్ కు తగ్గట్టుగా వినాయక్ మార్పులు చేశాడట. స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయిందంటే, ఇక మెగాస్టార్ షూటింగ్ కు సై అనడమే మిగిలుంది. కాస్టింగ్ కూడా పూర్తైపోతే, ఇక కత్తి షూటింగ్ మొదలైపోయినట్టే. కొన్ని రోజుల క్రితం చిరు చెప్పిన కత్తిలాంటోడు టైటిల్ ను కంటిన్యూ చేస్తారో లేక మారుస్తారో చూడాలి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



