సుప్రీం రిలీజ్ డేట్ ఫైనల్ అయింది..!
on Apr 23, 2016

మేనమామ మెగాస్టార్ కాకముందు వాడుకున్న సుప్రీం హీరో బిరుదును తీసుకుని, సుప్రీం టైటిల్ తో వస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇప్పటికే ట్రైలర్లతో ఆకట్టుకుని పాజిటివ్ బజ్ తో థియేటర్లలో ఎంటరవుతున్నాడు. మే మొదటి వారంలో సినిమా రిలీజ్ చేస్తున్నామని నిర్మాత శిరీష్, దర్శకుడు అనిల్ రావిపూడి అఫీషియల్ గా ప్రకటించారు. పటాస్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత తన రెండో సినిమాగా సుప్రీం ను తెరకెక్కించాడు అనిల్ రావిపూడి. దిల్ రాజు సాయి ధరమ్ కాంబినేషన్లో ఇది మూడో సినిమా కావడం విశేషం. ఇంతకు ముందు వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఫర్వాలేదనిపించాయి. ఈ సారి మాత్రం తమ కాంబినేషన్లో సూపర్ మిట్ కొట్టాలని డిసైడ్ అయ్యారు వీళ్లిద్దరూ. మే 6 న సూర్య 24 సినిమా కూడా రిలీజ్ అవుతోంది. అయినా కానీ తమ సినిమా మీద నమ్మకంతో సూర్యకు పోటీగా వెళ్లాలని ఫిక్స్ అయింది సుప్రీం టీం ఫిక్స్ అయింది. దిల్ రాజు ప్రమోషన్లు సరిగ్గా ప్లాన్ చేస్తే, బాక్సాఫీస్ దగ్గర సూర్యకు కూడా సుప్రీమ్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగానే కనిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



