సునీల్ రేటు తగ్గిందా?
on Mar 3, 2020
డిమాండ్ అండ్ సప్లై... వ్యాపారంలో ఎవరైనా అనుసరించే సూత్రం ఇదే. డిమాండ్ ఉన్నవాటిని సప్లై చేసి మార్కెటింగ్ చేసుకోవడానికి చూస్తారు. అందువల్ల, డిమాండ్ ఉన్నవాటికి రేటు ఎక్కువ. లేనివాటికి రేటు తక్కువ. కమెడియన్ గా సునీల్ డిమాండ్ తగ్గడంతో అతడి రేటు కూడా తగ్గిందని టాక్.
బ్రహ్మానందం తర్వాత తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన కమెడియన్ సునీల్. దాదాపుగా ప్రతి సినిమాలో కనిపించేవారు. హీరోల పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్లు వేసేవారు. కొన్ని సినిమాల్లో తళుక్కున మెరిసేవారు. ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు సునీల్ రోజుకి సుమారు మూడు లక్షల రూపాయలు తీసుకున్నాడని ఇండస్ట్రీ గుసగుస. ఫుల్ లెంగ్త్ రోల్స్ అయితే టోకుగా రెమ్యూనరేషన్ మాట్లాడుకునేవారు అట. పది, పదిహేను రోజుల షూటింగ్ అయితే మూడు లక్షలకు కిందకు దిగేవాడు కాదని టాక్. అటువంటి సునీల్ ఇప్పుడు ఫామ్ లో లేరు. హీరోగా హిట్లు లేక, కమెడియన్ గా టర్న్ అయ్యాక ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ కూడా అతడికి బ్రేక్ ఇవ్వలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో సునీల్ తన రేటు తగ్గించుకున్నాడట. రోజుకి రెండు లక్షలు, అందులో ఓ పాతిక వేలు తక్కువ ఇచ్చినా చేయడానికి రెడీ అంటున్నాడట. బళ్లు ఓడలు అవ్వడం, ఓడలు బళ్లు అవ్వడం అంటే ఇదేనేమో.