సింగం కాంబోలో ఫ్యామిలీ సినిమా
on Mar 3, 2020
'సింగం' అంటే సూర్య ఎంత గుర్తుకు వస్తాడో... దర్శకుడు హరి కూడా అంతే గుర్తుకు వస్తాడు. సౌతిండియన్ కాప్ యాక్షన్ డ్రామాగా 'సింగం' సిరీస్ కు ఒక గుర్తింపు వచ్చిందంటే... మెయిన్ రీజన్ దర్శకుడు హరి. యాక్షన్ సన్నివేశాలు తీయడంలో హరి శైలి సపరేటు. కెమెరా వేగంగా తిరగడం, హీరోలు అరుస్తూ డైలాగులు చెప్పించడం... హరి సినిమాల్లో మాత్రమే కనిపిస్తాయి. సింగం సిరీస్ లో మూడో సినిమా అనుకున్నంత హిట్ అవ్వలేదు. తర్వాత విక్రమ్ హీరోగా తీసిన స్వామి సీక్వెల్ కూడా ఆడలేదు. ఈ టైం లో హరికి సూర్య మరో అవకాశం ఇచ్చారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో 'అరువ' సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.
సూర్య, హరి కాంబినేషన్ లో 'అరువ' ఆరో సినిమా. ఇంతకు ముందు వచ్చిన సింగం సిరీస్ కంటే ఇది డిఫరెంట్ సినిమా. పల్లెటూరి నేపథ్యంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య సాగే కథతో ఈ సినిమా తీస్తున్నారు. ఫైట్స్ కంటే ఎమోషనల్ హైలైట్ అవుతుందట. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తీస్తున్నారట. ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే... కొన్నేళ్ళ క్రితం కార్తి హీరోగా హరి దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు. ఆ సినిమా టైటిల్ 'అరువ'. ఒకవేళ అదే కథతో ఈ సినిమా తీస్తున్నారు ఏమో అని అనుమానం చాలామందికి వచ్చింది. వాటికి నిర్మాత జ్ఞానవేల్ రాజా చెక్ పెట్టారు. ఈ కథ ఆ కథ కాదని కొత్త కథతో ఈ సినిమా తీస్తున్నామని ఆయన అన్నారు.