సందీప్‌ను పిండనున్న కృష్ణవంశీ..!
on Apr 16, 2016
కృష్ణవంశీ..ఒకప్పుడు తన క్రియేటివ్ కథలతో తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించిన డైరెక్టర్. సింధూరం, అంత:పురం, ఖడ్గం ఇలా ఏది పట్టుకున్నా అన్ని సూపర్ హిట్సే. అయితే అదంతా గతం ఇప్పుడు చేతిలో ఆఫర్లు లేక ఖాళీగా ఉంటున్నాడు క్రిష్. మొగుడు, పైసా సినిమాలతో వెనక్కితగ్గాడు వంశీ. కానీ గోవిందుడు అందరివాడేలే మంచి వసూళ్లను రాబట్టడంతో తనలో విషయం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఫైనల్‌గా రుద్రాక్ష పేరుతో ఓ ఫాంటసీ సినిమాను ప్లాన్ చేశాడు. ఇది చర్చల్లో ఉండగానే నటసింహ బాలయ్య వందో సినిమా కోసం పిలుపు రావటంతో రుద్రాక్షను పక్కకు నెట్టాడు. బాలయ్యకు కృష్ణవంశీ చెప్పిన కథ నచ్చలేదు. దీంతో ఉన్నది పోయే ఉంచుకున్నది పోయింది అన్నట్టు తయారైంది పరిస్థితి. దీంతో ఒక యంగ్ హీరోతో సినిమా తీయాలనుకున్నాడు వంశీ. ఆ హీరో సందిప్ కిషన్. కెరిర్‌లో ఓ మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న సందీప్, కృష్ణవంశీ ఆఫర్‌తో ఎగిరి గంతేశాడంట. మరి సందీప్‌ని ఏ మేరకు పిండుతాడో.