వర్మ ఫ్యాక్టరీ నుంచి కొత్త డాన్..!
on Apr 16, 2016
రామ్గోపాల్వర్మ..తన టేకింగ్‌తో టాలీవుడ్, బాలీవుడ్‌లలో కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు. హార్రర్..కామెడీ..రోమాన్స్..ఫ్యాక్షన్..యాక్షన్ ఇలా జోనర్ ఏదైనా రామూ మార్క్ ఉండాల్సిందే. అలాగే ఇండియాలో గ్యాంగ్ స్టర్ స్టోరీలకు బ్రాండ్ అంబాసిడర్ ఏవరైనా ఉంటే అది ఒన్ అండ్ ఓన్లీ రామ్ గోపాల్ వర్మ. అప్పుడెప్పుడో విడుదలైన శివ..గాయం..సర్కార్..సత్య సినిమాల నుంచి రీసెంట్‌గా వచ్చిన రౌడీ, ఎటాక్ సినిమాల దాకా ఎన్నో రామూ నుంచి వచ్చాయి.
అయితే ఇప్పుడు వర్మ ఫ్యాక్టరీ నుంచి మరో డాన్ మన ముందుకు రానున్నాడు. మాఫియాను ఒకతరం ఏలిన డాన్ ముత్తప్ప రాయ్ జీవిత చరిత్రను సినిమాగా తీయాలని ఆర్‌జీవీ డిసైడయ్యాడు. ఈ సినిమాకి "రాయ్" అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు బీటౌన్ టాక్. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ టైటిల్ రోల్‌లో నటించనున్నాడు. ఇప్పటికే వివేక్‌తో రక్త చరిత్ర లాంటి హిట్ సినిమా చేసాడు వర్మ. మరి ఈ సినిమాతో వర్మ ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తాడో.