సరైనోడు రీషూట్ పుణ్యం చిరంజీవిదే..!
on Apr 16, 2016
అల్లుఅర్జున్, బోయపాటి శ్రీను కాంభినేషన్‌లో తెరకెక్కిన సినిమా సరైనోడు ఈ సినిమా విడుదలకు సిద్ధమైపోయింది. మరో వారం రోజుల్లో ధియేటర్స్‌లోకి వచ్చేస్తుందని అభిమానులంతా వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో ఏ సినిమా అయినా మళ్లీ షూటింగ్ జరుపుకుంటుందా..? కాని సరైనోడికి ఆ పరిస్థితి ఎదురైంది. దీనికంతటికి మూలకారణం అల్లు అర్జున్ ముద్దుల మావయ్య మెగాస్టార్ చిరంజీవి.
సరైనోడు ఔట్ చూసిన చిరుకి ఈ సినిమాలో ఏదో మిస్సైందనిపించింది. అసలే ఇండస్ట్రీలో ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై చాలా కేరింగ్ తీసుకుంటున్నాడు బన్నీ. దీనిని నిలబెట్టుకోవాలనుకుంటున్న టైంలో మెగాస్టార్ రీ షూట్‌కి ఆర్డర్ వేయడంతో మావయ్యకి సై అన్నాడు సరైనోడు. దీనికి తోడు యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్‌లో ఉండటంతో సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇస్తామన్నారు. అటు చిరంజీవి..ఇటు సెన్సార్ బోర్డు ఆదేశాలతో సరైనోడు మళ్లీ సెట్టెక్కాడు. బన్నీతో పాటు మిగిలిన చిత్ర యూనిట్ అంతా ఒక రోజు రీ షూటింగ్‌లో పాల్గోంది. మొత్తానికి యూ/ఏ సర్టిఫికేట్ తెచ్చుకుని ఈ నెల 22న థియేటర్లలోకి అడుగుపెట్టనున్నాడు సరైనోడు.