సుమలత భర్తకు కోరిక ఒకటి తీరలేదు!
on Nov 25, 2018

కన్నడ నటుడు, కాంగ్రెస్ నేత, నటి సుమలత భర్త అంబరీష్ ఇకలేరు. కొంతకాలంగా కిడ్నీ, హృద్రోగ సమస్యలతో బాధ పడుతున్న ఆయన శనివారం రాత్రి కన్నుమూశారు. శనివారం రాత్రి అంబరీష్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు చికిత్స ప్రారంభించిన కొంత సమయం తరవాత ఆయన తుదిశ్వాస విడిచారు. అంబరీష్ అసలు అసలు పేరు హుచ్చే గౌడా అమర్‌నాథ్. సినిమాల్లోకి వచ్చాక అంబరీష్ అని పేరు మార్చుకున్నారు. ఆయన్ను అభిమానుల ముద్దుగా అంబీ అని పిలిచుకుంటారు. 1972లో విడుదలైన 'నాగరాహవు' చిత్రంతో అంబరీష్ వెండితెరకు పరిచయమయ్యారు.

ఐదు దశాబ్దాల నట ప్రయాణంలో సుమారు 200లకు పైగా చిత్రాల్లో నటించారు. అంబరీష్ సతీమణి సుమలత తెలుగులో పలు చిత్రాల్లో కథానాయికగా, ఈతరం హీరోలకు అమ్మగా నటించారు. ఈ దంపతులకు ఓ కుమారుడు. అతడి పేరు అభిషేక్ గౌడ ఉన్నారు. కుమారుణ్ణి హీరోగా చూడాలనేది అంబరీష్ కోరిక. తనయుణ్ణి హీరోగా పరిచయం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈలోపు విషాదం జరిగింది. కుమారుణ్ణి హీరోగా చూడకుండానే ఆయన పైలోకాలకు వెళ్లారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



