జయసుధగా 'ఆర్‌ఎక్స్100' భామ!
on Nov 25, 2018

ఒక్క సినిమాతో యూత్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో 'ఆర్ఎక్స్100' భామ పాయల్ రాజ్‌పుత్ ముందువరుసలో వుంటుంది. పంజాబీ ముద్దుగుమ్మకు తెలుగులో చాలా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆమె మాత్రం ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్నారు. 'ఆర్ఎక్స్100' తరవాత ఒక యాక్షన్ సినిమాకు సంతకం చేసిన పాయల్, తాజాగా మరో సినిమాకు సంతకం చేశారు. తెలుగులో ఆమెకిది భారీ అవకాశమని చెప్పుకోవాలి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో సహజనటి జయసుధగా నటించే అవకాశం పాయల్ తలుపు తట్టింది. మరో ఆలోచన లేకుండా వెంటనే ఆమె అంగీకరించారు. ఎన్టీఆర్, జయసుధ పలు సినిమాల్లో జంటగా నటించారు. 'డ్రైవర్ రాముడు', 'కేడీ నంబర్ 1', 'సర్దార్ రాముడు', 'మహాపురుషుడు' మొదలగు చిత్రాల్లో ఎన్టీఆర్, జయసుధ జోడీ సందడి చేసింది. ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆ సినిమాల ప్రస్తావన, ఆ సినిమాల్లో సన్నివేశాలు వచ్చినప్పుడు బాలకృష్ణ, పాయల్ జోడీ సందడి చేస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



