రీమేక్ తో క్రియేటివ్ డైరక్టర్ !!!
on Nov 24, 2018

గత కొంత కాలంగా క్రియేటివ్ డైరక్టర్ తన స్తాయికి తగ్గ సినిమాలు చేయడంలో ఫెయిలవుతూ వస్తున్నాడు. `నక్షత్రం` చిత్రంతో కృష్ణ వంశీ లో అసలు ఆ క్రియేటివ్ డైరక్టర్ ఏమయ్యాడు? అంటూ ప్రేక్షకులన నుంచి విమర్శుకుల నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశీతో ఇప్పుడు ఏ నిర్మాత కూడా సినిమా చేయడానికి ముదుకు రావడం లేదు. అయితే కృష్ణ వంశీ నెక్ట్స్ సినిమా గురించి ఒక వార్త ప్రస్తుతం వినిపిస్తోంది.
అదేమిటంటే....బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ మెయిన్ క్యారక్టర్ లో నటించిన మరాఠి చిత్రం `నట సామ్రాట్` చిత్రాన్ని తెలుగులో చేయడానికి కృష్ణ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నానా పటేకర్ పాత్రలో తెలుగులో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ని తీసుకోవాలని భావిస్తున్నాడట కృష్ణ వంశీ. ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న కసితో పని చేస్తున్నడాట ఈ క్రియేటివ్ డైరక్టర్. చూద్దాం ఈ సారైనా గట్టిగా కొడతాడో లేదో..!!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



