రాజమౌళి తండ్రినే మించిపోయిన సుమ
on Jan 25, 2017
.jpg)
తన వాక్చాతుర్యంతో..సెన్సాఫ్ హ్యుమార్‌తో బుల్లితెరపై నవ్వులు, పువ్వులు పూయిస్తూ స్టార్ యాంకర్‌గా వెలుగొందుతోంది సుమా కనకాల. ఒక్క బుల్లితెరే కాకుండా..ఆడియో ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లకు సైతం సుమే కావాలి..అంతలా అందరిని ఆకట్టుకుంది ఆమె. అలాంటి సుమను అడ్డంగా బుక్ చేసేశారు..దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తండ్రి, రచయిత వి.విజయేంద్రప్రసాద్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీవల్లి ఆడియో రిలీజ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ..చాలామంది నా దగ్గరికి వచ్చి కథలు రాయడం ఎలా..మీరు ఇంత బాగా కథలు ఎలా రాయగలుగుతున్నారు అని అడుగుతుంటారు..
దానిలో పెద్ద విద్య ఏం లేదు..అబద్దాలు బాగా ఆడగలిగితే మంచి రచయిత కావొచ్చు. కథ అంటే అబద్ధం..ఎన్ని అబద్ధాలాడితే అన్ని కథలు రాయొచ్చు అని చెప్పారు విజయేంద్రప్రసాద్. అయితే అబద్దాలు ఆడటంలో నన్ను మించిన వారు లేరనుకున్నా..కానీ నా కంటే వంద కిలోమీటర్ల ముందు ఒక వ్యక్తి కనిపించారు..ఆ వ్యక్తి ఎవరో కాదు యాంకర్ సుమ. ఆడియో వేడుకల్లో ఆమె ఇష్టమొచ్చినట్లు అబద్దాలు ఆడుతుంది..ఈవెంట్‌కు వచ్చిన గెస్ట్‌లని ఇంద్రుడు-చంద్రుడు అని పొగిడేస్తుందనడంతో వేదికపై నవ్వులే నవ్వులు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



