ఎన్టీఆర్ విలన్ ఎన్టీఆరేనా?
on Jan 25, 2017

ఎన్టీఆర్ కనీవినీ ఎరుగని ప్రయోగం చేయబోతున్నాడా? తన సినిమాలో తనే విలన్‌గా కనిపించబోతున్నాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఎన్టీఆర్ కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రిభినయం చేస్తున్నాడు. అందులో ఓ పాత్ర... పూర్తి నెగిటీవ్ షేడ్‌లో ఉండబోతోందట. అంటే తన సినిమాలో తనే విలన్ అన్నమాట. టెంపర్ సినిమాలో కాస్త నెగిటీవ్ చాయలున్న పాత్రని పోషించాడు ఎన్టీఆర్. ఆ పాత్ర.. ఎన్టీఆర్‌లోని నటుడ్ని కొత్త కోణంలో చూపించింది.
టెంపర్ ఇచ్చిన ధైర్యంతోనే ఎన్టీఆర్ ఇప్పుడు ఇలాంటి డేరింగ్ స్టెప్ వేయబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి జై లవకుశ అనే పేరుని పరిశీలిస్తున్నార్ట. జై. లవ, కుశ అనే ముగ్గురు అన్నదమ్ముల మధ్య జరిగే కథ ఇది. మరి విలన్‌గా ఈ ముగ్గురిలో ఎవరు కనిపించనున్నారో తెలియాల్సివుంది. ఫిబ్రవరి 11న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో ముగ్గురు కథానాయికలుంటారు. వారెవరన్నది త్వరలో తెలుస్తుంది. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌కి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



