రయీస్‌కు పొలిటికల్ స్ట్రోక్
on Jan 25, 2017

ఒకవైపు ప్రమోషన్ కార్యక్రమాల్లో బీజీగా ఉండగానే ...బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ నటించిన రయీస్‌కు రాజకీయ సెగ తగిలింది. ఈ సినిమాను పరోక్షంగా ఉద్దేశిస్తూ బీజేపీ సీనియర్ నేత కైలాస్ విజయ్ వర్గియా చేసిన ట్వీట్ వివాదమవుతోంది. అసలు మ్యాటరేంటంటే షారుఖ్ నటించిన రయీస్, హృతిక్ రోషన్ నటించిన కాబిల్ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. దీంతో ఈ రెండింటినీ పోల్చుతూ కైలాష్ ఓ ట్వీట్ చేశారు..దేశభక్తి లేని ఆ రయీస్ వల్ల ఏం ప్రయోజనం ఉండదు..మనమంతా కాబిల్‌కు మద్దతు తెలుపుదాం అంటూ ట్వీట్ చేశాడు.
పరోక్షంగా ఆయన ఉద్దేశ్యం రయీస్ చూడవద్దనే..దీనిపై కింగ్‌ఖాన్ అభిమానులు భగ్గుమనడంతో బీజేపీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కైలాష్ గతంలోనూ షారుఖ్‌ని లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన ఇండియాలో ఉంటున్నప్పటికీ మనసు మాత్రం పాకిస్థాన్‌లో ఉంటుందని...షారుఖ్ సినిమాలు భారత్‌లో కోట్లు సంపాదిస్తున్నప్పటికీ..ఆయనకు మాత్రం ఇక్కడ అసహనం కనిపిస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



